స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు సమాయత్తం అవుతున్న ప్రభుత్వం రైతుల్లో సానుకూల దృక్పథం కలిగేలా భరోసా అస్రం సంధించింది. రెండే రోజుల్లో భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేసింది.
వానాకాలం పంటల సాగు వేల రైతుల చేతికి కాసులందించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే గేమ్ చెంజర్ కాబోతుందనే సంబరం హస్తం శ్రేణుల్లో ఉంది. గతయేడాది భరోసా నిధులు ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డ సర్కార్ ఈసారి రెండు రోజుల్లో భరోసా నిధులు పంచేసింది.
ప్రభుత్వం ఫై రైతుల్లో ప్రతికూలత వుందని విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో నే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి వెనుకాడింది.
పూర్తీ స్థాయిలో నిధులు సమకూర్చుకున్నాకే ఈసారి భరోసా నిధులు మంజూరి చేసింది. అందుకే ఈసారి రెండు రోజుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చిన్న, సన్నకారు రైతులచేతికి భరోసా కాసులు వచ్చేసాయి వానాకాలం సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద జిల్లాలో 2,98,472మంది రైతులకు రూ. 326.03 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయి .
రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో సైతం నమోదు చేశారు . మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలోని 2,12,172 మంది రైతుల ఖాతాలలో రూ. 160.72 కోట్ల నిధులు ఇప్పటికే జమ అయ్యాయి .
పెట్టుబడి సాయం ప్రారంభించిన మొదటి రోజైన ఈ నెల 16వ తేదీన రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని 1,681,66 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రూ. 95.66 కోట్ల పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసింది.
మంగళవారం మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న 44,006 మంది రైతుల ఖాతాలలో రూ. 65.06 కోట్ల నిధులు జమ చేసింది . మొదటి రెండు రోజులలోనే మొత్తంగా జిల్లాలో 2,12,172 మంది రైతుల ఖాతాలలో రూ. 160.72 కోట్ల నిధులు జమ అయ్యాయని అన్నారు.
మిగతా రైతులకు కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి వారి ఖాతాలలో జమ చేయనుంది.
మరో వైపు కొత్తగ వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన రైతులకు సైతం భరోసా నిధులు ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు.
స్థానిక సంస్థల ఎన్నిక వేల గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఓటర్లు గా ఉన్న రైతులకు భరోసా నిధులతో ఆపన్నహస్తం అందించింది.
మరో వైపు ఇందిరమ్మ ఇండ్లు ,రాజీవ్ యువవికాసం రుణాల పంపిణీ తో గ్రామీణ ప్రాంతాల్లోప్రభుత్వ మరింత సానుకూలత పెంచుకుంది.
