HomeTelanganaNizamabadచలో వరంగల్ …….సకల ఏర్పట్ల తో తరలివెళ్తున్న గులాబీ శ్రేణులు…

చలో వరంగల్ …….సకల ఏర్పట్ల తో తరలివెళ్తున్న గులాబీ శ్రేణులు…


సకల సౌకర్యాల తో గులాబీ శ్రేణులు అధికారం వరంగల్ దారి పట్టాయి. దాదాపు అయిదు గంటల ప్రయాణం కావడంతో ఉమ్మడి జిల్లా నుంచి బిఆర్ యస్ శ్రేణులు ఉదయమే బయలు దేరాయి .జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గులాబీ కారు లో బయలు దేరారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి 27 బస్సులు, 25 ప్రైవేట్ బస్సులు,110 టాక్సీ వాహనాలు,150 నాయకులు మరియు కార్యకర్తల వాహానాలలో వెళ్లినట్లు చెప్తున్నారు .


కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాటర్ ప్యాకెట్లు, జెర్సీ మజ్జిగ ప్యాకెట్లు మీటింగ్ కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మార్గమధ్యలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బోజనాలు ఏర్పాటు చేసారు ఒక్కో వాహనం కు ఒక్కరి ని ఇంచార్జ్ గా పెట్టారు.

అలాగే జిల్లా లోని ఆయా సెగ్మెంట్ లనుంచి మాజీ ఎమ్మెల్యే ల అద్వర్యం లో బిఆర్ యస్ శ్రేణులు సానుభూతి పరులు పెద్దసంఖ్యలోనే తరలి వెళ్లారు.

ఒక్కో వాహనం అందులో వచ్చే వారి ని పరిగణ లోకి తీసుకోని నగదు కేటాయించారు. భోజనం వసతి తో పాటు తిరుగు ప్రయాణం లో మందు సైతం ఇచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. జన సమీకరణ కోసం మాజీ ఎమ్మెల్యే వ్యయప్రయాసలు పడ్డారు. గతంలో ఎన్నడూ లేనంత గా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments