Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSAndhra Pradeshచిరు కు మెగా హిట్ .......మన శంకర వరప్రసాద్ కు హిట్ టాక్

చిరు కు మెగా హిట్ …….మన శంకర వరప్రసాద్ కు హిట్ టాక్

మెగాస్టార్ చిరంజీవి కి ఈసారి పండగ బాగా కల్సి వచ్చింది వింటేజ్ లుక్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు”ఈ సంక్రాంతికి హిట్ టాక్ వచ్చింది. ఆయన కూతురు నిర్మాత గా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సెక్యూరిటీ అడ్వైజర్ శంకర వరప్రసాద్ (చిరంజీవి), బిజినెస్ ఉమెన్ శశిరేఖ (నయనతార) మధ్య జరిగిన ఫ్యామిలీ కథ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది .. సినిమాలో మెగాస్టార్ నుంచి ఆశించే వింటేజ్ కామెడీ టైమింగ్, మాస్ మేనరిజమ్స్ అదిరిపోగా, ఫస్టాఫ్‌లో వచ్చే బుల్లిరాజు ఎపిసోడ్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.

ఇక సెకండాఫ్‌లో మైనింగ్ మొఘల్ వెంకీ గౌడగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మరోస్థాయి కి తీసుకెళ్లింది ; ముఖ్యంగా చిరు-వెంకీ ఇద్దరూ కలిసి ఒకరి పాటలకు ఒకరు డాన్స్ చేస్తూ, డైలాగులు పేల్చుతుంటే థియేటర్లలో ఈలలు మోత మోగుతాయి. అనిల్ రావిపూడి తన గత సినిమాల కంటే బెటర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా, సుత్తి లేకుండా జాగ్రత్త పడ్డారు.

భీమ్స్ అందించిన మాస్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద బలంగా నిలిచాయి. నయనతార తన పాత్రలో హుందాతనాన్ని క్యారీ చేయగా, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం తమ రోల్స్‌తో మెప్పించారు. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా, సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపించినా..

మెగాస్టార్-వెంకీ మామల క్రేజీ కాంబినేషన్ హిలేరియస్ కామెడీ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తానికి, ఎలాంటి లాజిక్కులు వెతకకుండా ఈ పండుగకి కుటుంబం అంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ను అనిల్ తీర్చి దిద్దారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!