నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి రేకులపల్లి లక్ష్మీ నర్సవ్వ మృతి చెందారు.
ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఓ కన్వెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫోటోకు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డిని,ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,ఇంచార్జి మంత్రి సీతక్క,వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
