నగరంలోని బాలికల వసతి గృహం నుంచి మిస్సింగ్ అయిన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం అయ్యింది.
బుదవారం ఉదయం నగరంలోని ఒక ఎస్సీ,ఇద్దరు బీసీ బాలికల వసతి గృహం నుంచి పదవ తరగతి కి చెందిన ఇద్దరు,తొమ్మిదవ తరగతి కి చెందిన ఒక బాలిక ముగ్గురు కలిసి వసతి గృహం నుంచి బయటకి వెళ్లిపోయారు.
దీంతో హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్ లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీంతో పోలీసుల విచారణలో ఒక బాలిక నాందేడ్,మరి ఇద్దరు బాలికలు హైదారాబాద్ లో వారి ఆచూకీ లభ్యం అయినట్లు తెలిసింది.వసతి గృహం నుంచి బయటకి వెళ్ళడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
