Friday, November 14, 2025
HomePOLITICAL NEWSగులాబీ పార్టీలో సహకార బ్యాంకు చిచ్చు ........ఫలించిన వేముల విధేయుడి వ్యూహం ......రగులుతున్న పోచారం...అహంకారమే కొంప...

గులాబీ పార్టీలో సహకార బ్యాంకు చిచ్చు ……..ఫలించిన వేముల విధేయుడి వ్యూహం ……రగులుతున్న పోచారం…అహంకారమే కొంప ముంచింది.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉన్న జిల్లాలో బిఆర్ యస్ పరిస్థితి అధికారం కోల్పయి దిక్కుతోచని స్థితి లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కంచుకోట లాంటి జిల్లాలో తుడిచి పెట్టుక పోయింది.మూడు నెలల గడువులో వచ్చిన లోకసభ ఎన్నికల ను ఎలా ఎదుర్కోవాలో తెలియక మల్ల గుల్లాలు పడుతుంది. అతికష్టమీద బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ కట్టబెట్టింది.

కానీ జిల్లా సహకార బ్యాంకు పాలక మండలి లో తిరుగుబాటు వ్యవహారం పార్టీ లో కొత్త చిచ్చు రేపింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ కి పెద్దదిక్కుగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడి భాస్కర్ రెడ్డి ను డీసీసీబీ కుర్చీ నుంచి అవమానకరంగా తప్పించారు.సొంత పార్టీ కి చెందిన డైరెక్టర్లే తిరుగుబాటు చేయడం పార్టీలో రచ్చకు దారితీసింది. అసలు బ్యాంకు పాలక మండలిలో 20 మంది వుంటే వారంతా బిఆర్ యస్ కు చెందిన వారే అదికూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే ల విధేయులే. వారి కనుసైరాలతో ముందుకు సాగే వారే .

అలాంటి డైరెక్టర్ల తిరుగుబాటు చేయడం పోచారం జీర్ణించుకోలేక పోతున్నారు.ఇంకా ఏడాది కూడా లేని పదవీ కోసం పెద్దాయన శక్తి మేరకు యత్నించారు.ఎహే భాస్కర్ రెడ్డి తప్ప ఎవరైనా సరే అంటూ డైరెక్టర్లు తెగేసి చెప్పారు. చివరికి న్యాయ పోరాట అస్రం కూడా ఫలించలేదు.చివరికి డీసీసీబీ దశాబ్దాల చరిత్ర లో మొదటి సారిగా ఛైర్మెన్ ను అవిశ్వాస పరీక్షతో తొలగించారు.

కానీ ఇందులో ఎవరి వ్యూహం ఎలా ఉన్న ఛైర్మెన్ భాస్కరరెడ్డి అహంకార వైఖరి కి మూల్యం చెల్లించుకున్నారనే వాదనే పాలక మండలి సభ్యుల్లో వ్యక్తం అవుతుంది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి సైతం నష్టం కలిగిస్తుందని భావించారు. కానీ కాంగ్రెస్ బీజేపీ లు చేసిన తప్పిదాలు పోచారం కు కలిసి వచ్చాయి.పాలక మండలి సబ్యులకు ఉన్న అసంతృప్తి ని రమేష్ రెడ్డి అదనుగా చేసుకున్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి విధేయుడిగా వుంటూ పదేళ్లుగుత్తేదారుగా అవతారం ఎత్తారు. బాల్కొండ లో భారీ పనుల్ని తానే చేసాడు. ఆయన కోట్లాది రూపాయలు విలువైన పనులు దక్కించుకున్నాడు. మరో గుత్తేదారుడి పని దక్కని పరిస్థితి వుండే. కానీ సహకార బ్యాంకు కుర్చీ కోసం గతంలోనే ట్రై చేసాడు దక్కలేదు.ఆర్థికంగా బలంగా మారాడు …పార్టీ అధికారం లో లేదు ….అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలక నేత సుదర్శన్ రెడ్డి తో బంధుత్వం కలిసి వచ్చింది. ఇంకేముంది జెండా ఎత్తాడు.

ఎలాగో భాస్కర్ రెడ్డి వైఖరి తో రగిలి పోతున్న డైరెక్టర్లు ఇదే అదనుగా భావించారు. రమేష్ రెడ్డి తో చేతులు కలిపారు.ఆయనతో కలిసి హస్తం పార్టీ పెద్దలను కలిశారు.ఎలాగో వలస లకు గేట్లు ఎత్తేయడంతో వారందరిని చేరదీశారు. యంత్రాంగం వారికి సహకరించేలా ఆదేశాలు ఇచ్చేసారు. అందుకే అవిశ్వాస ఘట్టం అంతా సవ్యంగా సాగింది.వేముల విధేయుడి వ్యూహం ఫలించింది.

17 డైరెక్టర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ పంచన చేరిపోయారు. లోకసభ ఎన్నికల సవాల్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీ పెద్దలకు డీసీసీబీ పంచాయితీ తలపోటు తెప్పించింది. క్షేత్ర స్థాయిలో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో ననే అంచనాల్లో బిఆర్ యస్ నేతలున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!