HomeCRIMEఓఅర్ఆర్ మీద కాల్పుల కలకలం .....ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ దొంగ

ఓఅర్ఆర్ మీద కాల్పుల కలకలం …..ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ దొంగ

హైదారాబాద్ లోనిబొంగుళూర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 12 వద్ద బుధవారం తెల్లవారు జామున కాల్పులు కలకలం సృష్టించాయి.నల్గొండ లో పలు దొంగతనాలకేసులో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ కోసం నల్గొండ జిల్లా సీసీఎస్ పోలీసులు గత కొద్దీ రోజులుగా గాలిస్తున్నారు ఏపీ కి చెందిన శ్రీకాంత్ హైదారాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్ టీం హుటాహుటీన హైదారాబాద్ వచ్చింది.

బొంగలూర్ ఓ ఆర్ ఆర్ వద్ద అతని తన ముఠా తో కల్సి డిసియం వాహనంలో ఉన్నట్లు పక్క సమాచారం మేరకు సీసీ యస్ బృంధం రంగంలోకి దిగి డిసియం ను చుట్టుముట్టింది పట్టుకోవడానికి యత్నించారు కానీ అతను ఎదురు దాడికి చేయడంతో మఫ్టీ లో ఓ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో శ్రీకాంత్ కు కాలు లో దూసుకెళ్లింది గాయం లో అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు.

దీనితో అప్రమత్తం అయిన అతని దిల్ షుక్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.కానీ అతని వెంట డిసియం లో ఉన్న మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక చికిత్స తర్వాత శ్రీకాంత్ ను సీసీఎస్ పోలీసు లు తమవెంట తీసుకెళ్లారు.

//// అనేక కేసులో శ్రీకాంత్ కీలక నిందితుడు ////

ఏపీ లోని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ మీద అనేక కేసులున్నాయి ముఖ్యంగా2007 గుంటూరు లో ఓ కానిస్టేబుల్ హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్నారు .ఇది కాక మరో 75 పైగా దొంగతనాల కేసులో ను ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాగా చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments