HomeCRIMEనిజామాబాద్‌ గౌతమ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం: నేరాల నివారణకు ప్రత్యేక పట్రోలింగ్ - ఏసిపి రాజా...

నిజామాబాద్‌ గౌతమ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం: నేరాల నివారణకు ప్రత్యేక పట్రోలింగ్ – ఏసిపి రాజా వెంకటరెడ్డి

నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్‌..నగరంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్..

నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.

కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి బసవ రెడ్డి సూచన మేరకు ఏసిపి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ మూడవ టౌన్ పరిధిలోనీ గౌతమ్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు 100 మంది పోలీసులు పది టీములుగా లతో పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. ప్రజలలో అభద్రతాభావం తొలగించడానికి దొంగతనాల నివారణ మాదకద్రవ్యాల నేరాల నివారణ మొదలగు కార్యక్రమాలలో భాగంగా గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏరియా గౌతమ్ నగర్ డివిజన్లో ప్రతి గల్లీలో పెట్రోలింగ్ సోదాలు నిర్వహించి అనుమానితులను సస్పెక్ట్లను రౌడీషీట్లను చెక్ చేసినట్లు తెలిపారు.

అలాగే సరియైన పత్రాలు లేని నంబర్లు లేని దాదాపు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని వెరిఫై చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలందరూ యూనిఫామ్ లేని పోలీసులని చట్టాన్ని అందరూ గౌరవించాలని అనుమానితులు గురించి అసాంఘిక కార్యకలాపాల గురించి సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు.

అందరూ ఒక కమిటీగా ఏర్పడి ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీనివల్ల చాలా నేరాలు నివారించవచ్చుననీ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భద్రత కోసం ఉద్దేశించిందని తెలిపారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు సలహాలు కూడా స్వీకరించడం జరిగింది.

ఈ ప్రోగ్రాం లో గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలు, రాజా వెంకటరెడ్డి ఏసిపి నిజామాబాద్ నగర సిఐ శ్రీనివాస్ రాజ్, త్రీ టౌన్ ఎస్సై హరిబాబు, నిజామాబాద్ డివిజన్లోని పలువురు సిఐలు రఘుపతి, సురేష్, మల్లేష్, భిక్షపతి, శ్రీలత ఎస్ఐలు ఏఎస్సైలు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments