డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి జైలు శిక్షా.. 27 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 32మందికి ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు.అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందు హాజరుపరచగా 27 మందికి రూ : 38500/- జరిమానా విధించినట్లు తెలిపారు.
అలాగే శంకర్,ఎంబు సాయిలు వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.పరశురాం, శనిగరం రాజు,ఈదుల నరేందర్ వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
