సీఎం రేవంత్ రెడ్డి పై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. ఆర్ ఫై కాంగ్రెస్ నేతలు పోలీసులకు పిర్యాదు చేశారు ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్ 1 టౌన్ లో టీపీసీసి ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్ లిఖిత పూర్వకంగా కోరారు .
ఈ సందర్భంగా తాహేర్ బిన్ హందన్ గారు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్. భవన్, జరిగిన సికింద్రబాద్ లోకసభ నియోజకవర్గ సమావేశంలో బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు మాట్లాడుతూ “మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సి.ఎం. రేవంత్ రెడ్డి మూడు నెలలుగా డబ్బులు ఇస్తేనే భవనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా వసులు చేసిన రూ.2,500 కోట్లను డిల్లీకి పంపించారు.
ఓవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లను మరోవైపు బిల్డర్లు రియాల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని . కత్తెర పెట్టుకొని జేబు దొంగలా తిరుగుతున్నారు” అంటూ ఆరోపించరని,అభూతకల్పనలతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశ్యంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగముగా ఆరోపించడము, రైస్ మిల్లర్లు, ఇసుక దందా, బిల్డర్లను, రియాల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఊహాజనితమైన విధంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరం అని, కాబట్టి కె.టి.రామారావును విచారణ నిమిత్తమై వెంటనే అరెస్టు చేసి పై విషయాలను రుజువుపరచవలసిందిగా, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతని పై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకొనగలరని తహెర్ బిన్ హందన్ డిమాండ్ చేశారు
