మద్నూర్ లో భారీ చోరీ …..వడ్డీ వ్యాపారి ఇంట్లో లూటీ ……..కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోఓ వడ్డీ వ్యాపారి ఇంట్లో లూటీ జరిగింది. భారీఎత్తున నగదు ఎత్తుకెళ్లారు. మండల కేంద్రంకు చెందిన విఠల్ వడ్డీ వ్యాపారవేత్త. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. సుమారు రాత్రి 8.45 కు తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. అదేవిధంగా బీరువా కూడా తెరిచి ఉంది. అయితే, బీరువాలో పెట్టిన 25 తులాల బంగారం రూ.16 వేల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బంగారం విలువ రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇక నగదు రూ.16 వేలు కూడా ఎత్తుకెళ్లినట్టుగా బాధితుడు విఠల్ తెలిపాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు