ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లాలో బాసగూడ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు పోలీసు లు ప్రకటించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు సైతం గాయాలు అయ్యాయని సమాచారం. బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టు నక్సల్స్ వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి