అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన చేదు పలితాలతో గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ నిజమాబాద్ లోకసభ అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది.అందుకే టికెట్ ఎవరికి క్లియర్ చేశారనే ఉత్కంఠ మాత్రం వీడడం లేదు. .సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో రేపో మాపో తుదిజాబితా లో నిజామాబాద్ అభ్యర్థి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పార్టీవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఈపాటికే బీజేపీ, బిఆర్ యస్ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసాయి. ఈ మేరకు వారు ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి కంచుకోట లాంటి నిజామాబాద్ స్థానం కోసం పట్టుదలతో ఉంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం ఎడతెగని కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగానే తటస్థులను తెరమీదికి తెచ్చింది.
పీసీసీ డీసీసీ లు మూకుమ్మడిగా సిఫారస్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానం ఆసక్తి చూపడం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన వైపు గట్టిగా మొగ్గుచూపుతున్నారు. పెద్దాయన వుంటే నే అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారనే ధీమాతో ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతకు లోకసభ టికెట్ ఇవ్వడానికి ఢిల్లీ పెద్దలు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో జాబితాలో నిజామాబాద్ లోకసభ స్థానం ను పెండింగ్ లో పెట్టేసారు. దీనితో సునీల్ కనుగోలు బృందం మరోసారి రంగంలోకి దిగింది ఆర్థిక సామజిక సమీకరణలే ప్రాతిపదికగా తటస్థులను రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నాయి .ఇందుకోసం ఓ ప్లాష్ సర్వే ను చేప్పట్టారని సమాచారం.
ఇందులో భాగంగానే నగరంలో పేరుప్రఖ్యాతలు గాంచిన మహిళా డాక్టర్ తో పాటు ప్రముఖ సినీనిర్మాత సోదరుడు పేర్లు తుదిపరిశీలనలోకి వచ్చాయని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ రెడ్డి సామజిక వర్గమే అందులోనూ ఆర్థికంగా బలంగా ఉన్నవారే.నగరంలో ముప్పై యేళ్లుగా గైనకాలజి డాక్టర్ పనిచేస్తున్న డాక్టర్ కవిత పేరును మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తెరమీదికి తెచ్చారని సమాచారం.మహబూబనగర్ జిల్లాకు చెందిన ఆమె తో పాటు భర్త రవీందర్ రెడ్డి కూడాడాక్టరే . కవిత రెడ్డి సామజిక సేవలో క్రియాశీలకంగా ఉన్నారు.నిజానికి ఆమె గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నే కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ చివరి లో మిస్ అయింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఆమె ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కి సైతం టచ్ లో వెళ్లారు.
అయితే మహిళా అందులోనూ డాక్టర్ వృత్తిలో వుండడం ఆమె కలసి వచ్చే అంశమే. మరో వైపు సినినిర్మాత దిల్ రాజు సొంత అన్న నర్సింహా రెడ్డి పేరు సైతం ఢిల్లీ పెద్దలు పరిశీలనకు వచ్చింది. .కానీ కొత్త వారికి టికెట్ ఇస్తే సీనియర్ నేతలు ఏ మేరకు కలసి కట్టుగా పనిచేస్తారనేది అనుమానం వ్యక్తం అవుతుంది. అందుకే ఈసారి కొత్త వారితో ప్రయోగం వద్దని రేవంత్ ఢిల్లీ పెద్దలకు సముదాయించే యత్నాల్లో ఉన్నారు. అయితే ఓడిన నేతలకు టికెట్ ఇస్తే బాల్కొండ నుంచి ఓడిపోయిన సునీల్ రెడ్డి ని సైతం పరిగణలోకి తీసుకోవాలని ఒకరిద్దరు నేతలు రేవంత్ ను కోరినట్లు సమాచారం
