మహానగరం హైదారాబాద్ లో గణేష్ నిమజ్జనం లో కీలక ఘట్టంగా చెప్పే ఖైరాతాబాద్ మహ గణపతి నిమజ్జనం పూర్తయింది. ఈ మహా కతృవు ను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో సాగర తీరం జనసంద్రం అయింది.
సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరు అయ్యారు. 70 అడుగుల భారీ సప్తముఖ మహా గణనాథుడి విగ్రహాన్ని వేల మంది భక్తుల మధ్య డప్పుల మోతలు నినాదాలతో హోరెత్తింది.
ట్యాంక్‌బండ్ పై శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మహాగణపతి ని భారీ క్రేన్ లతో నాల్గో నెంబర్ వద్ద హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు .
అంతకు ముందు ఖైరతా బాద్ నుంచి మహా గణపతి ని ఊరేగింపు గా ట్యాంకు బండ్ కు తరలించారు ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు వేల మంది భక్తులు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.
ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షించారు.
సోమవారం రాత్రి 11 గంటలకే స్వామివారి మండపంలో కలశ పూజ నిర్వహించారు. విగ్రహంను వెల్డింగ్తో కదిపారు భారీ క్రేన్ లతో వాహనం మీదికి చేర్చారు మంగళవారం ఉదయం 6.30 గంటలకే మహా గణపతి ఊరేగింపు ప్రారంభించారు.
ఈ ఊరేగింపు ఖైరతాబాద్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంది.
అనంతరం గేట్ నంబర్ 4 వద్ద సూపర్ క్రేన్ సాయంతో గణనాథుడికి అంత్య పూజలు నిర్వహించి నిమజ్జనం ప్రక్రియను పూర్తి చేశారు.కీలక ఘట్టం నిర్ణిత సమయానికే పూర్తీ కావడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది.
