తీరు మారని సర్కారు వైద్యం… వీల్ చైర్ లేక అవస్థలు పడుతున్న రోగులు..ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ఠవేశాయి..నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు వైద్య సేవల విషయంలో నిర్వహణ లోపాలు వెక్కిరిస్తున్నాయి..
ఈ ఆస్పత్రిలో వీల్ చైర్ అందుబాటులో లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా అభివృద్ధి చేశా మనిపైకి చెపుతున్నా అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం శాపంగా మారింది ..
మెడికల్ కాలేజీ కి అనుబంధంగా ఉన్న ఈ ఆసుపత్రి లో అనేక సమస్యలు వెంటాడు తున్నాయి. వివాద రోగాలతో ప్రతి రోజు 2వేలకు మంది పైగా రోగులు వస్తుంటారు. ప్రతియేటా కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు వైద్య సేవలు అందించే ఈ సర్కారీ దవాఖాన లో అవస్థలు పడుతున్నారు.
చికిత్స కోసం వస్తోన్న రోగులకు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ కాళ్లు, చేతులు విరిగి వైద్యం చేయించుకొనేందుకు వచ్చినవారికి కనీస వసతులు కూడా కరువయ్యాయి. శుక్రవారం జీజీహెచ్ రోగులు సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నగరంలోని ఓ వృద్ధురాలు ఆకస్మాత్తుగా మెట్లపై నుంచి కిందపడిపోవ డంతో కాలు విరిగింది. దీంతో చికిత్స కోసం శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.
ఆ వృద్ధురాలు కాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఉండడంతో బంధువు ఆసుపత్రి సిబ్బందిని వీల్ చైర్ అడగగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చే రోగిని తీసుకెళ్లడానికి వీల్ చైర్ మాత్రం ఉండవు..
కానీ ఆసుపత్రి బెడ్ షీట్స్ తీసుకెళ్లడానికి వీల్ చైర్ ఎలా ఉంటుందనీ ప్రశ్నించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో నిత్యం ఏదో ఒక సంఘటన నిదర్షణమిస్తున్న పై అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూస్తలేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
