శాసన మండలి ఎన్నికలు అధికార పార్టీలో చిచ్చురేపాయి. ముఖ్యంగా మైనారిటీ లు రగిలి పోయారు. సోమవారం తెల్లవారు జామున నుంచే రోడ్డెక్కారు. ముస్లిం లకు కనీసం ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం ఫై వారంతా రగిలి పోయారు ఏకంగా గాంధీభవన్ వద్దే ఆందోళన కు దిగారు.
కుల గణన లో తమ జనాభా ఎంతో ప్రభుత్వమే తేల్చేసిందని ఎమ్మెల్సీ అభ్యర్థి అందుకు అనుగుణంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ తమను ఎందుకు విస్మరించిందని మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
గాంధీ భవన్ వద్ద ఆందోళన చేసిన వారంతా ఎంపీ గా ఎమ్మెల్యే లుగా పోటీ చేసి ఓడిన వారే ! మరో వైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గీయులు నెహ్రు పార్క్ వద్ద బైఠాయించారు. కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేతగా పార్టీకి విధేయుడిగా ఉన్న షబ్బీర్ అలీ కి ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వాలని వారంతా నినాదాలు చేశారు.
అధికార పార్టీకి చెందిన వారే రోడ్డు మీద బైఠాయించడంతో కంగు తిన్న పోలీసులు హైరానా పడ్డారు వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. సోమవారమే నామినేషన్ లకు చివరి రోజు కావడంతో మైనార్టీ నేతలు పార్టీ మీద ఒత్తిడి పెంచేలా ఈ ఆందోళనలు చేసారు.
మైనార్టీ నేతల ఆందోళనలతో ఉలిక్కి పడ్డ అధిష్టానం తదుపరి వచ్చే ఎమ్మెల్సీ ల్లో సర్దు బాటు చేస్తామని భరోసా ఇచ్చింది. ఈపాటికే పట్టబద్రుల నియోజకవర్గం ఎన్నికలో పరాజయం అధికార పార్టీ ని కుదిపేస్తుంటే. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కోల్పోవడం ఫై అధిష్టానం గుర్రుగా ఉంది.
పట్టభద్రుల నియోజకవర్గ పరిధి లో దిగ్గజ నేతలు సీరియస్ గా పనిచేయక పోవడం వల్లే ఓటమి ఎదురైందని భావిస్తున్న అధిష్టానం ఎవరెవరు క్రియాశీలకంగా పనిచేసారనేది అరా తీస్తుంది. జిల్లాకు చెందిన ఒకరిద్దరు నరేందర్ రెడ్డి భారీగా ఆర్థిక లబ్ది పొంది కూడా కనీసం పని చేయలేదట.
సిట్టింగ్ స్థానం చేజారిన నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాల నుంచి ఎమ్మెల్యే కోట లో ఎమ్మెల్సీ లుగా ఎవ్వరికి అవకాశం ఇవ్వొద్దనేది అధిష్టానం నిర్ణయంగా చెపుతున్నారు.అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకు సైతం ఎమ్మెల్సీ గా ఇవ్వడానికి సైతం ససేమిరా అంది.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక అగ్గి కి ఆజ్యం పోసింది. శాసన మండలి లో ఎమ్మెల్యే కోట లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే సంఖ్యా బలం మేరకు కాంగ్రెస్ పార్టీ కి నాలుగు స్థానాలే దక్కుతాయి.
ఇందులో సిపిఐ కి ఒక స్థానం కేటాయించారు మిగితా మూడు స్థానాల కు అరడజన్ మంది పేర్లు పరిశీలన చేసిన అధిష్టానం అసెంబ్లీ టికెట్ లు త్యాగం చేసిన దయాకర్ విజయ శాంతి లకు డీసీసీ కోట లో ఎస్టీ సామజిక వర్గం కు చెందిన శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ లుగా అవకాశం ఇచ్చింది.
నిజానికి అధిష్టానం ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక లో సామజిక సమీకరణ పాటించింది. యస్సి ,ఎస్టీ, మహిళా లకు అవకాశం వచ్చింది. గవర్నర్ కోటాలో రెడ్డి ,మైనార్టీ వర్గానికి చెందిన కోదండరాం ,అమీర్ అలీ కి అవకాశం మొదటి దఫాలో నే ఇచ్చారు అందుకే ఈసారి రెడ్డి ,మైనార్టీ లకు నిరాకరించారు.
క్యాబినెట్ లో మైనార్టీ మంత్రి లేకవడంట్ ఈసారి ఎమ్మెల్యే కోట లో మండలి కి వెళ్లి క్యాబినెట్ బెర్త్ పొందాలని షబ్బీర్ అలీ ,అజారోద్దిన్ లాంటి నేతలు ఢిల్లీ స్థాయిలో బలంగా లాబీయింగ్ చేశారు. కానీ అధిష్టానం మాత్రం ఈసారి మైనార్టీ కోట ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. గవర్నర్ కోట లో ఓ స్థానం సర్దుబాటు చేసిన నేపథ్యం ను వారు గుర్తు చేస్తున్నారు .
