HomeTelanganaNizamabadలియోనియా రిసార్ట్ లో కాంగ్రెస్ మహా క్యాంప్ ......జిల్లా నేతలంతా అక్కడే మకాం .....యంఐయం కార్పొరేటర్లు...

లియోనియా రిసార్ట్ లో కాంగ్రెస్ మహా క్యాంప్ ……జిల్లా నేతలంతా అక్కడే మకాం …..యంఐయం కార్పొరేటర్లు సైతం ……మున్సిపాల్టీ లావారీగా ఉత్తమ్ రివ్యూ

కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిలర్లతో హైదారాబాద్ శివారు లోని లియోనియా రిసార్ట్ లో క్యాంప్ వేశారు. ఆదివారం సాయంత్రానికి యంఐయం కార్పొరేటర్లు సైతం ఇదే క్యాంపు కు చేరుకున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ ఆర్మూర్ బీమ్ గల్ మున్సిపాలిటీ కి చెందిన కొత్త కౌన్సిలర్లు ను ఇక్కడే వుంచారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తో పాటు సునీల్ రెడ్డి వినయ్ రెడ్డి లు సైతం ఇక్కడే మకాం వేశారు. మంత్రి ఉత్తమ్ రెడ్డి రోజంతా ఇక్కడే ఉండి ఆయా మున్సిపాల్టీ ల వారీగా నేతలు కొత్తగా ఎన్నికైన ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఛైర్మెన్ వైస్ ఛైర్మెన్ లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో నేతలతో సమాలోచనలు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ మేయర్ అభ్యర్థి విషయంలో ఎక్కువగా చర్చ జరిగింది. అలాగే మేయర్ ఎన్నికలో మద్దతు ఇస్తున్న యంఐయం కు డిప్యూటీ మేయర్ ఇవ్వడానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో షకీల్ సతీమణి పేరు ను ఆ పార్టీ ప్రతిపాదించి నట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments