ఏసీబీ చరిత్ర లోనే మొదటి సారిగా నేరుగా కోర్టు లోనే లంచం తీసుకుంటుండగా లీగల్ ఆఫీసర్ తో పాటు కోర్టు కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.
ఈ సంఘటన కామారెడ్డి కోర్టు లో శుక్రవారం జరిగింది.కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సంజయ్ కు కోర్టు బాధ్యతలు అప్పగించారు.
చీటింగ్ కేసును అనుకూలంగా చేస్తానని నిందితుడి తో భారీ మొత్తం డీల్ సెట్ చేసుకున్నాడు. దీనితో అనుమానం వచ్చిన నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
కోర్టు లో పనిచేసే ఓ లా ఆఫీసర్ పేరును సదురు కానిస్టేబుల్ ప్రస్తావించిన విషయం ఏసీబీ అధికారులు అరా తీస్తున్నారు.
అయితే సదురు కానిస్టేబుల్ నుంచి మాత్రం పది వేల రూపాయలు నిందితుడి నుంచి తీసుకుంటుండగా పట్టుకున్నారు.
