అసలే అధికారం కోల్పయి తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో అధినేత తనయ కవిత ధిక్కార స్వరం గులాబీ శ్రేణుల్లో కల్లోలం రేపుతోంది.
పార్టీలో పరిణామాలు వరంగల్ సభ నిర్వహణ లో వైఫల్యాలు….. కెసిఆర్ స్పీచ్ …..బీజేపీ కాంగ్రెస్ ల మీద వైఖరి చివరికి దుం ధామ్ తీరును ఎండగడుతూ ఎమ్మెల్సీ కవిత నేరుగా అధినేత కెసిఆర్ కు లేఖ రాయడం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న ఆమె కు జిల్లా పార్టీ లో ప్రాబల్యం బలంగాఉంది. ఉద్యమ కాలం లో జిల్లా లో నా మాత్రంగానే ఉనికి సాగించిన కవిత పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్ల పాటు జిల్లా పార్టీలో పాలనా వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు.
అధినేతే నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కే పూర్తీ అధికారం ఇచ్చిన ప్పటికీ కవిత ను కాదని ఎమ్మెల్యే లు అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి ని ఎదుర్కున్నారు. ఎంపీ గా వుండడంతో ప్రొటొకాల్ సైతం పాటించడం అనివార్యంగా భావించే వారు చుట్టూ ఉండే కోటరీ పార్టీలో క్రియాశీలంగా ఉండే వారెవ్వరిని కవిత దగ్గరికి రానిచ్చే వారే కాదు.
జస్ట్ ఎమ్మెల్యే మీద అజమాయిషీ చేయడానికి అయిదేళ్ల ఎంపీ పదవీ కాలం పూర్తీ అయింది. అందుకే ఎమ్మెల్యే లు కవిత విషయంలో లోలోపల రగిలి పోయారు ఒకరిద్దరు ఎమ్మెల్యే మందు పార్టీల్లో కవిత ను వ్యక్తిగతంగా తులాడినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
చివరికి దిగ్గజ నేతలు డీఎస్ విషయంలోనూ ఆమె కర్కశంగా వ్యవహరించడం వల్లే తనయుడి అర్వింద్ బీజేపీ లో చేరి కవిత నే టార్గెట్ చేసి చివరికి ఆమె ఎంపీ ఎన్నికల్లో ఓడించారు. కెసిఆర్ కు అత్యంత సన్నహితులుగా ఉండే మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మిషన్ వేముల ప్రశాంత్ రెడ్డి లను సైతం ఆమె కట్టడి చేసారు.అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లకు పోటీగా తన ముద్ర నేతలను ఓపెన్ గా ప్రోత్సహించారు.
పోటీ నాయకత్వం తయారు చేయడం అధినేత కెసిఆర్ దాక వెళ్ళింది ఆయనే స్వయంగా కవిత కు నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికలో పార్టీ జిల్లాలో క్లిన్ స్వీప్ చేసింది. కానీ జస్ట్ అయిదు మాసాలకే జరిగిన ఎంపీ ఎన్నికల్లో కవిత ఘోర పరాజయం పాలయ్యారు.
ఎమ్మెల్యే లు కూడా బాల్కోని మరీ ఆమెను ఓడించారని పార్టీ వేదికల్ ప్రచారం జరిగింది. అదికూడా అసలు ప్రాబల్యమే లేని బీజేపీ నుంచి అర్వింద్ గెలవడం కవిత ను తీవ్రంగా కలిచి వేసింది.
చాల కాలం ఆమె జిల్లా వ్యవహారాలకు దూరంగా ఉండి పోయారు. ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేశారనేది ఎవరెవరు తెరవెనుక వెన్నుపోటు పొడిచారనేది అధినేత కు నివేదించారు. ఓ దశలో కెసిఆర్ సైతం ఎమ్మెల్యే లఫై రగిలి పోయారు.
కానీ కవిత స్వయంకృపరాధం వల్లే ఎమ్మెల్యే ఎన్నికలో సహాయ నిరాకరణ చేసారు. అయితే తీవ్ర మనస్థాపం తో ఇంటికి పరిమితం అయినా కవిత రాజకీయంగా మరోసారి తెరమీదికి తేవడానికి జిల్లా నుంచి లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా రంగంలోకి దింపారు. కానీ ఈసారి ఎమ్మెల్యే లు శక్తి వంచన లేకుండా పోటీపడి సొంత ఖర్చులతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చేలా చక్రం తిప్పారు.
గత అనుభవాల నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యాక జిల్లా పార్టీ పాలన వ్యవరాల్లో అంటీముట్టనట్లుగా వుంటూ వచ్చారు. రెండో సారి ఎమ్మెల్సీ అయ్యాక యాక్టివ్ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అర్బన్ బోధన్ సెగ్మెంట్ లకే పరిమితం చేసినా సరే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు నియోజకవర్గాలను చుట్టేశారు.
కానీ ఆమె ఇంచార్జ్ గా ఉన్న అర్బన్, బోధన్ లో పార్టీ ఘోరంగా పరాజయం పాలయ్యింది. లిక్కర్ కేసులో అనూహ్యంగా జైలు కు వెళ్లడం తో ఎంపీ ఎన్నికలకు దూరం అయ్యారు. ఆయా సెగ్మెంట్ లలో ఎమ్మెల్యే లకు పోటీగా ద్వితీయ శ్రేణి నేతలను ఎగదోసినా కీలక సమయంలో చేతులు ఎత్తేసారు.
లిక్కర్ కేసులో ఢిల్లీ కి విచారణకు వెళ్తే ఆయా సెగ్మెంట్ లనుంచి ఎమ్మెల్యే లకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ నేతలను ప్లైట్ లో ఢిల్లీ కి తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలే ఎమ్మెల్యేల్లో అసంతృత్తి హెచ్చు మీరెలా చేసింది.
తాజాగా కవిత ధిక్కార స్వరం ఎత్తడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.కేటీఆర్ పర్యవేక్షణలో సాగిన వరంగల్ సభ నిర్వహణ లో లోపాలు అలాగే అధినేత స్పీచ్ లో తేడాలఫై ఆమె ప్రశ్నించారు.
