రొటీన్ చెకింగ్ లో భాగంగా ఆసుపత్రి కి వెళ్లిన ఏ ఆర్ ఆర్ ఐ అక్కడే రియాజ్ ఉన్న గది వద్ద తలుపు పగిలి అద్దాలు ధ్వంసం అయి ఉన్నాయని ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఆర్ ఐ కానిస్టేబుల్ లు రియాజ్ ఉన్న గది లోకి వెళ్లారని ఆ క్రమం లోనే కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఫైర్ చేయడానికి సిద్ధం అవుతుండగా ఆర్ ఐ రియాజ్ ను ఎంతో వారించాడని గన్ పడేయాలని చెప్పినా రియాజ్ వినలేదని అందుకే గత్యంతరం లేక ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని సీపీ వివరించారు.
బుల్లెట్ గాయం తో కింద పడ్డాడని అక్కడే మృతి చెందాడని వివరించారు నిబంధనల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తామని మృతదేహం కు పంచానామాచేసి పోస్టు మార్ట్రం చేస్తామన్నారు
