వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పోలీసు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ, బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు.
ఈ సందర్భంగా నగర ప్రజలకు సీపీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. భక్తులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూనే పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు.
