HomeTelanganaNizamabadమినీ ట్యాంక్ బండ్‌కు 'చీకటి' రోజులు!..అభివృద్ధికి గ్రహణం.. నిర్వహణ అట్టర్ ప్లాప్..

మినీ ట్యాంక్ బండ్‌కు ‘చీకటి’ రోజులు!..అభివృద్ధికి గ్రహణం.. నిర్వహణ అట్టర్ ప్లాప్..

నిజామాబాద్ నగరంపై పాలకుల నిర్లక్ష్యం..నాడు వెలుగుల జిలుగులు.. నేడు టార్చ్ లైట్లే దిక్కు..అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాఅది నగరానికే మణిహారం.. సాయంత్రం వేళ వేలాది మందికి ఆహ్లాదాన్ని పంచే అద్భుత తీరం.

కానీ, పాలకుల మార్పు ఆ ప్రాంతానికి శాపమైందనీ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో శ్రమించి, నిధులను వెచ్చించి అభివృద్ధి చేసిన బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్) నేడు అనాథగా మారిందన్నారు.

కనీసం బల్బు మార్చే నాథుడు లేక, పర్యవేక్షించే అధికారి లేక అంధకారంలో మగ్గిపోతోంది.కళ్లున్నా చూడలేని స్థితిలో యంత్రాంగం ఒకప్పుడు విద్యుత్ దీపాల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోయిన ఈ మినీ ట్యాంక్ బండ్, నేడు చీకటి సామ్రాజ్యంగా మారిందనీ ఆగ్రహించారు.

నగరవాసులు వాకింగ్ చేయాలన్నా, కుటుంబంతో సేద తీరాలన్నా భయపడాల్సిన పరిస్థితి. చేతిలో టార్చ్ లైట్ ఉంటేనే కట్టపై అడుగు వేయగలం. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పార్కులోని పచ్చదనం ఎండిపోతోంది, ఫౌంటెన్లు మూలన పడ్డాయి. అభివృద్ధి చేయడం చేతకాకపోయినా, ఉన్న వాటిని కాపాడటంలో కూడా ప్రస్తుత పాలకులు విఫలమయ్యారనే విమర్శలు చేశారు.

కోట్లాది రూపాయల ప్రజా సొమ్ముతో నిర్మించిన ఆస్తులు కళ్ల ముందే శిథిలమవుతుంటే చూస్తూ ఊరుకుందామా? నగర అభివృద్ధిని గాలికొదిలేసిన వారికి మళ్ళీ ఓటు వేయాలా? అని నగర మేధావులు, సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments