లోకసభ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ కి వోటర్లు ఝలక్ ఇచ్చారు .అదికూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో .కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరవాత జరిగిన మొదటి ఎన్నికలో ఘోర పరాజయం పలకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ అభ్యర్థి ఓడిపోయారు.
పక్క ప్రణాళిక తో బిఆర్ యస్ ఎమ్మెల్సీ స్థానం గెలుచుకుంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయం సాధించారు.ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
బిఆర్ యస్ కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటి కి క్రాస్ ఓటింగ్ మీద ఆశతో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి ని రంగంలోకి దింపింది. మన్నే జీవన్ రెడ్డి పోటీలో నిలిచారు.. బిఆర్ యస్ అభ్యర్థిగా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు క్యాంపు రాజకీయాలు నిర్వహించాయి. భారీఎత్తున డబ్బులు వెదజల్లారు.
కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. బిఆర్ యస్ పక్షనా కేటీఆర్ వ్యూహరచన వ్యూహరచన చేశారు.కానీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని అందరూ అంచనా వేశారు.
కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థి గెలుపులో ప్రధాన భూమిక ను పోషించారు.
బీ ఆర్ఎస్ అభ్యర్థి 108 వోట్ల మెజార్టీ తో గెలిచారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది