ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు..నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో Laptopల దొంగ అరెస్ట్…నిత్యం ప్రయాణీకుల రద్దీతో కలకలాడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ చోరీలకు పాల్పడుతున్న నిందుతుడు పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో ఆ నిందుతుడి వద్ద రెండు లాప్టాప్ లు ఒక ట్యాబ్ లభ్యమవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీస్ లా కథనం ప్రకారం… నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ లో సోమవారం సాయంత్రం అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో తిరుగుతున్నాడు.
ఆ వ్యక్తిని విచారించి తనిఖీలు చేయగా అతను బోధన్ కు చెందిన గంగుల శ్రీధర్ అనే వ్యక్తి దగ్గర రెండు లాప్టాప్ లు ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు.పోలిస్ లు అతనినీ విచారించగా 29 తేదీన మరియు ఒకటో తేదీన రైల్వేలో ప్రయాణిస్తున్న వ్యక్తుల దగ్గర నుండి బ్యాగులు దొంగతనం చేశానని ఆ వ్యక్తి ఒప్పుకొన్నాడనీ పోలీస్ లు తెలిపారు.
అలాగే ఈరోజు తను దొంగిలించిన ట్యాబ్ మరియు ల్యాప్ టాప్ లు హైదరాబాద్లో అమ్మడానికి వెళ్తున్నానని ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుండి రెండు లాప్టాప్ లు ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ ఎస్ఐ తెలిపారు.
అంతరం అతన్ని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలియజేశారు. ఈ తనిఖీలో హనుమాన్లు, కుబేర్ రవికుమార్, గురుదాస్ సేన నాయక్ ,మణికిరణ్ ,రాములు సిబ్బంది పాల్గొన్నారు.