జిల్లాను డెంగ్యూ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. మాయదారి రోగం బారిన పడి అనేక మంది విలవిలా డుతున్నారు.
మోపాల్ మండలం వెంకట్రాం తండా కు చెందిన ఓ నర్స్ ను డెంగ్యూ కాటేసింది. తండాకు చెందిన సంగీత నగరంలోని శశాంక్ ప్రైవేట్ ఆసుపత్రి లో గత అయిదేళ్లుగా నర్స్ పనిచేస్తుంది.
ఆమె గత కొద్దీ రోజులుగా డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. ప్లేట్ లేట్ పడిపోవడంతో ఆమె చికిత్స కోసం నగరంలోని సన్ రైస్ ఆసుపత్రి కి తరలించారు.
