నిజామాబాద్ నగరంలోని ఖిల్లా బాలికల పాఠశాల, బుదవారం డీఈవో దుర్గా ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడారు. పాఠశాలల్లోని తరగతి గదులను పరిశీలించారు.
మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు.పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
