Thursday, April 16, 2026
HomeCRIMEధర్మపురి హిల్స్ వద్ద యువకుడి అనుమానాస్పద మృతి

ధర్మపురి హిల్స్ వద్ద యువకుడి అనుమానాస్పద మృతి

నగర శివారులోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని ఆఫ్రోజ్ (35)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.

ఆఫ్రోజ్ మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!