శ్రీ వాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఆదివారం కొలువుదీరింది. నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడిగా పురుషోత్తం గుప్తా, ప్రధాన కార్యదర్శిగా వివేకానంద గుప్తా, కోశాధికారిగా మార నిరీష్ (ప్రభు) గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో గో పూజను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఐక్యతకు, సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
