తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 సంవత్సరంలో జరిగిన అక్రమ నియమాకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పును అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, AIFDS ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు , అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య యాదగిరిరావుకి హైకోర్టు తీర్పు కాపిని అందజేయడంతోపాటు దాన్ని అమలు చేయాలని వినతిపత్రాన్ని ఇచ్చారు .
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్,AIFDS నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ 2012 సంవత్సరం జరిగిన నియామకాల్లో అవకతవకలు జరిగాయని నాటి వి.సి ,రిజిస్టార్లు దొడ్డిదారిన నియమకాలు చేపట్టారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించిన సందర్భంలో నాటినుండి నుండి నేటి వరకు సుదీర్ఘంగా కొనసాగిన కేసులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగానే అక్రమంగా ఈ యొక్క నియామకాలు జరిగాయని రాష్ట్ర అత్యంత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అమలు చేయకపోవడం పై అనేక అనుమానాలకు తావిస్తోంది.
అక్రమంగా నియామకమైన వారికి విసి రిజిస్టర్లు కొమ్ము కాసినట్టుగా స్పష్టమవుతుందని అన్నారు.
ఈ విషయంలో జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర దర్యాప్తు కోసం సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, అక్రమ నియమకాలపై నిగ్గు తేల్చాలని, అక్రమార్కుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలు పంపాలని, దుర్వినియోగమైన కోట్ల రూపాయలను వారి నుంచి రికవరీ చేసి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఆ నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బైరాపూర్ రవీందర్, జవారి రాహుల్, సుధాకర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
