ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఉద్యోగినిఫై క్యాబ్ డ్రైవర్ అత్యా చారానికి ఒడిగట్టాడు శంషాబాద్ విమానాశ్రయం లో ఇండిగో లో పనిచేస్తున్న యువతి . రోజు మాదిరిగానే నైట్‌షిఫ్ట్ కోసం క్యాబ్‌లో ఆమె విమానాశ్రయానికి బయలు దేరింది.
ప్రయాణ మధ్యలో క్యాబ్‌డ్రైవర్ ఎర్రపోగు ప్రశాంత్ కుమార్ (23) కారును అసలు మార్గం నుంచి కాకుండా దారిమళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి కారు దిగాడు.
ఆ తర్వాత వెనుక సీటు వైపు నుంచి తిరిగి కారులోకి ప్రవేశించి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇండిగో ఉద్యోగిని ప్రతిఘటించడంతో క్యాబ్‌డ్రైవర్ పరారయ్యాడు.
ఈ ఘటన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు . సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గంట లో గుర్తించారు. ప్రశాంత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
