HomeLaw and Orderముదురుతున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ల వివాదం...జిల్లాలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు....ప్రభుత్వ ఆదాయానికి గండి...

ముదురుతున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ల వివాదం…జిల్లాలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు….ప్రభుత్వ ఆదాయానికి గండి…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైసలివ్వనిదే పని కావడం లేదని ప్రతి పనికో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నా.. ఏదో సాకు చూపి రిజిస్ట్రేషన్ చేయమని చెబుతున్నారు.

కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి, తమ వారసత్వంగా వచ్చిన ఇంటిని మార్చుకోవాలన్నా.. తండ్రి పేరు నుంచి కుమారుడి పేరుతో గిఫ్ట్ డీడ్ చేసుకోవాలన్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కో ఇంటికి రూ.5 నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ వివాదం తీవ్రంగా ముదురుతోంది.

గత మూడు రోజులుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. డాక్యుమెంట్ ప్రతినిధులు గత మూడు రోజులుగా వారి కార్యాలయంలో తాళాలు వేసి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు బైఠాయించారు.

తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా సబ్ రిజిస్టర్ ప్రతి డాక్యుమెంట్ పైన సుమారు రూ.7000 నుంచి రూ 10,000 వరకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులు లేనిదే ఏ డాక్యుమెంట్ కూడా ముందుకు కదలడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లు చేసే విషయంలో కొందరు అధికారులు పేచీ పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments