నిజామాబాద్:నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల క్రింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపతుల సూర్యనారాయణ గుప్తా, నగర నుడా చైర్మన్ కేశవ వేణు, ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇరావతి అనిల్ మానాల మోహన్ అంత రెడ్డి రాజిరెడ్డి హాజరయ్యారు.
వారు లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. ఈ పథకాలు నిరుపేద యువతులకు ఆర్థిక సహాయంగా నిలుస్తున్నాయని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
