సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించడం జరిగింది.
అర్బన్ నియోజకవర్గంలో ఉన్న ఏడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటు ప్రజలకు కావలిసిన చికిత్స, మందులు అందించాలని సూచించారు.
అర్బన్ లో బస్తీ దవాఖానాల తీరు పైన ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసారు డాక్టర్స్, సిబ్బంది ఉన్నప్పటికీ దావఖనకు వచ్చే రోగులను పట్టించుకోవడం లేదని, మందులు ఇవ్వకుండా రికార్డులో మాత్రం లెక్కలు అధికంగా ఉండటం పై మండిపడ్డారు.
ఈ మధ్య కాలంలో ఓ బస్తీ దవాఖాన తనిఖీ చేసిన అంశాలను గుర్తు చేసారు అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని DM&HO ను ఆదేశించారు.ప్రైమరి, బస్తీ దావఖానా సెంటర్ల డాక్టర్స్ చిత్త శుద్ధితో ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు,పేదలకు అందాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని తెలియజేసారు.
DM&HO రాజశ్రీ ప్రైమరి హెల్త్ సెంటర్ లో టాయిలెట్స్ మౌలిక సౌకర్యాల ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, స్పందించిన ఎమ్మెల్యే గారు వీలైనంత త్వరలో వాటిని పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO అంజన, DSO డా. నాగరాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
