HomeTelanganaNizamabadమున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా...నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా…నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.

శనివారం మేయర్ నీతూ కిరణ్, నగర కమిషనర్ దీలిప్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. నగర పాలక సంస్థ పాలకవర్గం పదవి కాలం ఈ నెల 26 తో ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గం పధవి కాల ముగియ నుండడంతో చివరి సాధరణ పాలకవర్గం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం బిజెపి వర్సెస్ ఎంఐఎం గా వాదోపవాదాలు జరిగాయి. రోడు ప్రక్కన విధివ్యాపారాలకు విక్రయించుకునే విధంగా ఎజెండా తీసుకురావాలని ఎంఐఎం నాయకులు మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు.

అందుకు ఇటు బిజెపి నాయకులు ఇది ఎజెండాను ముందుకి కొనసాగించకుండ అడ్డుపడ్డారని ద్వజమెత్తారు. సమావేశాన్ని అర్థాంతరంగం ముగించడంతో వారు మేయర్ ముందు నేలపై కూర్చుండి నిరసన తెలిపారు.

బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నిరసన తెలిపారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కానీ మజ్లిస్ పార్టీ నాయకులు కావాలని సమావేశం ముందుకి కొనసాగించకుండ అడ్డుపడ్డారని బిజెపి నాయకులు తెలిపారు.

సమస్యలపై చర్చించకపోవడం తో కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో అన్ని పార్టీల కార్పొరేటర్లు నిరసనకు దిగారు.

ప్రధానంగా చివరి సమావేశంలో ఎలాంటి చర్చ జరగపోవడంపై కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ తీరు పట్ల మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments