HomeTelanganaHyderabadపాత బస్తీలో కరెంట్ బిల్లులు అడిగే దమ్ము రేవంత్ కు ఉందా ?........ ఇచ్చిన హామీలు...

పాత బస్తీలో కరెంట్ బిల్లులు అడిగే దమ్ము రేవంత్ కు ఉందా ?…….. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన సర్కార్ …..ఎంపీ అర్వింద్ ధ్వజం..

ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లు వసూలు చేసే దమ్ము రేవంత్ కు ఉందా..? హైదరాబాద్ అంతటా అమలు చేస్తున్న హైడ్రాను ఓల్డ్ సిటీలో అమలు చేస్తారా? అని అర్వింద్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముస్లీంలకు ఊడిగం చేస్తున్నారని, దమ్ముంటే రాష్ట్రానికి హిందువులు, ముస్లీంలలో ఎవరి వల్ల ఎంత ఆదాయం వస్తుందో లెక్కలు తీయించాలని ఎంపీ అర్వింద్ రేవంత్ కు సవాల్ చేశారు.హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయటం బాధ్యతగా భావించాలని అర్వింద్ అన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కులాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయనన్నారు. మోడీని విమర్శించే స్థాయి రేవంత్ కు లేదన్నారు.

హామీలు తీర్చలేక తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అర్వింద్ అన్నారు. భారత దేశాన్ని కాషాయం చేయడమే తన ముందున్న లక్ష్యంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. కేసీఆర్ ది ఇక ముగిసిన శకమేనని, బీఆర్ఎస్ దుకాణం ఇక త్వరలోనే మూత పడుతుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments