కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారని రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతి అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
ఎంపీ అర్వింద్ తో కలిసి ఆయన ఆదివారం జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్కార్ చేపట్టిన కులగణన ఓ బోగస్ ప్రక్రియ అని విమర్శించారు హిందూ ముస్లిం… బీసీ ముస్లిం అని ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.
కుల గణన ను తెర మీదకు తీసుకొచ్చి, ముస్లింల కోసమే కుల గణన చేశారని ఆరోపణ చేశారు. సర్వే లెక్కలు బోగస్ అని తేలడంతోనే మల్లి సర్వేకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు,విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అలాగే ఉద్యోగులకు ప్రతి ఆరు నెలల ఒకసారి డీఏ పెంచాల్సిన ప్రభుత్వం ప్రస్తుతం ఆరు డీఏ లలో ఒకటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.ఇక ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదని ఎద్దేవా చేశారు.
ఏడాది కలిసిన ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి మెంబర్స్ బకాయిలు చెల్లించకుండా ఎందుకు జాబ్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు పార్టీ పట్టిన గతే రేవంత్ రెడ్డి సర్కార్ కు పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నూకలు చెల్లాయని తెలిపారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూయించి మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యరేంటీలు,420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని దుయ్యబట్టారు.ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకం వచ్చిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్రంలో మలుపు తిప్పుతుందని అని ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి,కొమరయ్య,అదిలాబాద్ ఎంపీ రాజేష్,అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ,ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచరి,తదితరులు పాల్గొన్నారు.
