బాలుడి పై కుక్కల దాడి చేసిన ఘటన శనివారం జాక్రాన్ పల్లి పరిధి లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.జాక్రాన్ పల్లి మండలం చాంద్ మియా భాగ్ తండా కు చెందిన ధీరజ్ అనే బలునిపై కుక్కలు దాడి చేశాయని తీవ్ర గయాలపాలయ్యారనీ గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
కుటుంబీకులు చూసిన వెంటనే హుటాహుటిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. గ్రామంలో కుక్కల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయి దాడులకు పాల్పడుతుండటంతో పలు మార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాధు చేసిన చర్యలు తీసుకోలేరని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు