HomeCRIMEడ్రంక్ అండ్ డ్రైవ్: 45 మందిపై కేసులు

డ్రంక్ అండ్ డ్రైవ్: 45 మందిపై కేసులు

నిజామాబాద్: మద్యం సేవించి వాహనాలు నడిపిన 45 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం నాడు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ నేతృత్వంలో కంఠేశ్వర్ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

డ్రైవ్ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారి వాహనాలను స్వాధీనం చేసుకొని, వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.

ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెత్తే ఇటువంటి చర్యలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments