స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధం అవుతుంది. యంత్రాంగం సైతం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెలఖారు లో షెడ్యూల్ వచ్చేస్తుందని ప్రభుత్వం ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసింది. ప్రధాన పార్టీలు ఒక్కసారి ఉలిక్కి పడ్డాయి.
ఎన్నికల సమరం లో దిగడానికి సన్నాహాలు చేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ బిఆర్ యస్ ల మద్యే పోటీ సాగినా ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి.కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది.
ఎంపీపీ జడ్పిటిసీ స్థానాల్లో 90 శాతం మేరకు బిఆర్ యస్ గెలిచింది.దీనితో జడ్పి ఛైర్మెన్ కూడా బిఆర్ యస్ ఖాతా లోకి వెళ్ళింది. వరసగా రెండు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నా మాత్రంగా ఫలితాలు సాదించలేక పోయింది.
రెండు దఫాల్లోనూ ఆపార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండే. ద్వితీయ శ్రేణి నేతలు గంప గుత్తగా బిఆర్ యస్ పార్టీలోకి వెళ్లి పోయారు దీనితో జెడ్పిటిసి స్థానాల్లో పోటీ చేసే వారే లేకుండా పోయారు. ఉన్నవారికి బ్రతిమాలి టికెట్ ఇచ్చి పోటీ చేయించారు.
ఆలా పోటీ చేసిన వారిలో చాల మంది బిఆర్ యస్ ఎమ్మెల్యే లకు సరెండర్ అయ్యారు. అందుకే బిఆర్ యస్ అభ్యర్థులకు గట్టి పోటీ లేకుండా పోయింది. కానీ ఈసారి పార్టీ అధికారంలో ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లాఇద్దరు ఎమ్మెల్యే లున్నారు ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంచార్జ్ మంత్రి రంగంలోకి దిగబోతున్నారు.
అధికార వ్యవస్థ అండగా ఉండనుంది. అసెంబ్లీ, ఎంపీ పాటు పట్టబద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నామ మాత్రంగా ఆదరణ కనిపించింది. కానీ అధికారం లోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తుంది.రుణ మాఫీ, రైతు భరోసా ,సన్న వడ్లకు బోనస్,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లోన్లు, బిసి ,యస్సి ల రిజర్వేషన్ లు వంటి అంశాలను అస్రంగా మలుచుకొని ఈ ఎన్నికల్లో సానుకూల పలితాలు సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
ఎమ్మెల్యే, ఇంచార్జ్ లను బాద్యులుగా చేయబోతున్నారు. క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ ఆలోచనగా ఉంది.నామినేటెడ్ పదవులు ఇవ్వలేక పోయిన వారికి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి దింపి గెలిపించుకోవాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది.
2019 ఎన్నికల్లో ఎంపీ స్థానం గెలిచిసంచలనం సృష్టించిన బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో చావుదెబ్బ తింది.ఎంపీ గా గెలిచాక మొదటి సారిగా వచ్చిన ఎన్నికలు కావడంతో అర్వింద్ సీనియర్లను కాదని దూకుడుగా వెళ్ళలేదు.
కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో ఆయన అధిష్టానం జోక్యం ను సైతం వారించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ తానై పనిచేసారు. ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు.
తెలంగాణలో ఎక్కడా ఈ తరహా ఫలితాలు రాకపోవడం గమనార్హం! ఈసారి. ఎంపీ తో పాటు ఇద్దరు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్సీ లున్న బీజేపీ సానుకూల ఫలితాలు సాధించడం అనివార్యం. గత ఎన్నికల్లో బీజేపీ రెండే జడ్పిటిసి, రెండు ఎంపీపీ లను మాత్రమే తన ఖాతాలో ఉండే.
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి మరో రూరల్ బోధన్ బాల్కొండ ల్లో భారీ స్థాయిలో వోట్లు సాధించింది. ఎంపీ ఎన్నికలోనూ ఆవే ఫలితాలు వచ్చాయి. రెండో సారి ఎంపీ అయినా అర్వింద్ ఓ దశలో కేంద్ర మంత్రి అవుతారని పార్టీ వర్గాలు భావించాయి.
కానీ సీనియార్టీ నేపథ్యంలో ఆ ఛాన్స్ మిస్ అయింది. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో అందరికి కన్న ముందు ఉన్నారు. పార్టీలో గట్టి పట్టుసాధించారు. జిల్లాలో ఆయన తిరులేని ఆధిపత్యం సాధించారు.
ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అర్వింద్ కు అనివార్యం.భవిష్యత్ రాజకీయ అవసరాల దృశ్యా ఈసారి ఎంపీపీ, జెడ్పిటిసి ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదల తో పాటు పక్క ప్రణాళిక తో ఉన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను సైతం రంగంలోకి దించి ఫలితాలు సాధించే వ్యూహంలో ఉన్నారు.
జిల్లాలో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో ను వోటు బ్యాంకు బాగా పెరిగిందనే భరోసా తో ఆయన ఉన్నారు. అందుకే మున్సిపల్ కార్పొరేషన్ తరహాలోనే జెడ్పిటిసి స్థానాలు గెలవాలనేది అర్వింద్ ప్లాన్ గా ఉంది. ఎలాగో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ యస్ సంస్థాగతంగా బలహీనంగా మారింది.
కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ఆలోచన గా ఉంది. అధికారంలో ఉన్న పదేళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగు లేని ఫలితాలు సాధించిన బిఆర్ యస్ ఈసారి పోటీ చేయడానికే దిక్కులు చూసే పరిస్థితి లో ఉంది.
నా మాత్రం ఫలితాలు సాధిస్తే మహా గొప్ప అనే ధోరణి తో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి మాజీ ఎమ్మెల్యే లు ఇంకా కోలుకోవడం లేదు. పదేళ్ల పాటు కనుసైరాలతో నియోజకవర్గాల ను పెత్తనం సాగించిన ఎమ్మెల్యే లు ఒక్కసారి ఓటమి పలకరించడంతో దిక్కు తోచని పరిస్థితిలోకి వెళ్లారు అసలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు.
ఆయా నియోజకవర్గాల్లోపార్టీ దైన్య స్థితి లో ఉంది. ఎమ్మెల్సీ కవిత ఈ మద్యే ఆయా నియోజకవర్గాలను చుట్టొచ్చారు.కానీ మునుపటి జోష్ క్యాడర్ లో లేదు. అసలు ద్వితీయ శ్రేణి నేతలు అధికార పార్టీ నీడలో సేద తీరుతున్నారు. పదేళ్ల అధికారంలో అనేక దందా లకు అలవాటు పడిన నేతలకు అధికార పార్టీ అండ అనివార్యంగా భావిస్తున్నారు.
అందుకే ఈసారి లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కోవడం గులాబీ పార్టీ కి అంత సులువేమి కాదు.బలమైన అభ్యర్థులు దొరకడం కష్టం! లోకల్ బాడీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాకుంటే నియోజకవర్గాల్లో పార్టీ మరింత ప్రాబల్యం కోల్పోతుంది.
