హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ) పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రహదారి పక్కన నిలిపి ఉంచిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు.
ఈ ఘటనలో బైక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కారును నిలిపివేశారు. డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
