మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పేద ప్రజల భూములతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోంది.
కోట్ల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. మీ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజు దగ్గరలో ఉందని కేటీఆర్ హెచ్చరించారు.
365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలిస్తాం.. అని మా తమ్ముళ్లు, చెల్లెళ్లను మోసం చేసి వాళ్లు పోయి వాళ్ల తల్లిదండ్రులు, అత్తామామలు, తాత నాయినమ్మల కాళ్లు మొక్కేటట్టు చేసి కాంగ్రెస్కు ఓటేయించుకుని మోసం చేసినందుకు, బాండ్ పేపర్ రాసి మోసం చేసిన సన్నాసులకు తప్పకుండా భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నాయని అన్నారు
