నగరంలోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, శ్రీ వ్యాసపురి కన్యకాపరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్- బాసర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేది సాయంత్రం 4:30గం,లకు యం.ఎన్ కన్వేషన్ వేణుమాల్ వేదిక నందు దసరా అలయ్ బలయ్ కార్యక్రమాని నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ డా.మూడా నాగభూషణం గుప్తా తెలిపారు.
ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కవులు, కాళకారులు హాజరవుతున్నారు. ప్రతి యేటా అనావాయితిగా అలయ్ బలయ్ (ఆత్మీయ సమ్మేళనం)కార్యక్రమాని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కావున జిల్లా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు దారం గంగాధర్, సిర్ప లింగం,ఎర్ర సూర్యనారాయణ,డా.మద్దుకూరి సాయిబాబు,రాజు తదితరులు పాల్గొన్నారు.
