HomeCRIMEరెడీమేడ్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం..--- షార్ట్ సర్క్యూట్ కారణమా..--- రూ50 లక్షలు ఆస్తి నష్టం.

రెడీమేడ్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం..— షార్ట్ సర్క్యూట్ కారణమా..— రూ50 లక్షలు ఆస్తి నష్టం.

ఎల్లారెడ్డి.పట్టణంలో శకుంతల కాంప్లెక్స్ లో గల కనెక్ట్ మెన్స్ వేర్ రెడీమేడ్ బట్టలు దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దాదాపు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని నాగం దేవేందర్ తెలిపారు. యజమాని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం రాత్రి షాపు మూసివేసి దేవేందర్ ఇంటికి వెళ్లిపోయాడు. ఎల్లారెడ్డిలో శనివారం లేబర్ హాలిడే కావడంతో షాపు తెరవలేదు. ఆదివారం ఉదయం పనివాళ్ళు దుకాణం తెరిచి చూసే వారికి బట్టలు ఫర్నిచర్ మంటల్లో ఖాళీ పోయాయి. సమాచారం అందుకొని షాపుకు వెళ్లేసరికి అక్కడక్కడ పొగలు వస్తున్నాయన్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండవచ్చు అని యజమాని పేర్కొన్నాడు. వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడక్కడా ఉన్న చిన్నపాటి మంటల్ని ఆర్పి వేశారు.

ప్రమాదంలో విలువైన బట్టలతోపాటు ఫర్నిచర్ కాలిపోయినట్లు బాధితుడు దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా నష్టాన్ని గురి చేసిందని, దాదాపు 50 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments