HomeTelanganaNizamabad420 రోజులైనా..నెరవేరని కాంగ్రెస్ 420 హామీలు...కాంగ్రెస్ హామీ లపై గాంధీ విగ్రహానికి వినతి పత్రం. .

420 రోజులైనా..నెరవేరని కాంగ్రెస్ 420 హామీలు…కాంగ్రెస్ హామీ లపై గాంధీ విగ్రహానికి వినతి పత్రం. .

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులవుతుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ నాయకులు నిరసనకు నిరసన వ్యక్తం చేశారు.

గురువారం మాజీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని గాంధీ చౌరస్తా లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఇలా గాంధీ విగ్రహానికి వినతులు అందజేయడం వల్ల కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి కళ్ళు తెరుచుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. కాంగ్రెస్‌ పాలనలో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయని చెప్పారు.

రైతు బంధు కోసం, రైతుబీమా, రుణమాఫీ, కరెంటు, , సాగునీటి, పంటల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఏడాది పాలన ఎదురుచూపుల పాలన అంటూ విమర్శించారు.

దేశానికి వెన్నుముకైనా రైతుకు తెలంగాణ సర్కార్ వెన్నుపోటు పొడుస్తోంది. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభ లలో వెళ్లి ప్రజలతో పట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు జంకుతున్నారని ఎద్దేవ చేశారు.

ప్రజలను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు,వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నీతూ కిరణ్,న్యాలం రమేష్, సిర్ప రాజు,మెతుకు శివ కుమార్,పంచరెడ్డి సురేష్,రంగు సీతారాం,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments