HomeDevotionalసార్వజనిక గణేశ్‌ మండలి శోభాయాత్రకు సర్వం సిద్ధం..

సార్వజనిక గణేశ్‌ మండలి శోభాయాత్రకు సర్వం సిద్ధం..

దుబ్బ చౌరస్తా నుంచి ప్రారంభం.. ప్రధాన కూడళ్ల మీదుగా వినాయకుల బావి వరకుసార్వజనిక గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణేశ్‌ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, మేయర్‌ కూరగాయల ఉమారాణి, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. గణేశ్‌ మండలి నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

దుబ్బ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ప్రభాత్‌ థియేటర్‌, శివాజీచౌక్‌, లలిత మహల్‌ థియేటర్‌, శ్రద్ధానంద్‌గంజ్‌, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, నెహ్రూపార్కు, పవన్‌ థియేటర్‌ చౌరస్తా, బర్కత్‌పుర రోడ్డు, గురుద్వారా, ఓల్డ్‌ టూటౌన్‌, లక్ష్మీ మెడికల్‌, కోటగల్లి, గోల్‌హనుమాన్‌ చౌరస్తా, పూలాంగ్‌ చౌరస్తా మీదుగా వినాయకుల బావి వరకు కొనసాగనుంది.

మార్గంలో భక్తులు, గణేశ్‌ మండళ్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర సందర్భంగా ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన చోట్ల మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు. శోభాయాత్ర మార్గాన్ని అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మండళ్ల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో భాగంగా నిర్వహించే ఈ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాన మార్గాల్లో అలంకరణలు, విద్యుత్‌ దీపాలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నారు. నగరంలో గణేశ్‌ ఉత్సవాల సందడి నెలకొన్న నేపథ్యంలో శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments