అసాంఘిక కార్యకలాపాలు …..చట్ట వ్యతిరేక దందా లమీద ఉక్కుపాదం మోపే టాస్క్ ఫోర్స్ పేరుతొ యదేచ్చగా వసూళ్ల దందా సాగుతుంది.
అందులో అత్యంత క్రియా శీలకంగా ఉండే వారే ఆచితూచి వ్యవహరిస్తుంటే అసలు ఆ విభాగం తో సంబంధమే లేని ఓ హోమ్ గార్డు మాత్రం బరితెగించి మరీ వసూళ్ల దందా సాగిస్తున్నారు.
కొత్వాల్ ఉండే జిల్లా కేంద్రంలోనే అట్టడుగు స్థాయిలో ఉండే హోంగార్డ్ బాహాటంగా వసూళ్ల దందా సాగిస్తుంటే ఎవరు కూడా ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారనేది సర్వత్రా చర్చ నియాంశంగా మారింది.
కొత్వాల్ పర్యవేక్షణలో ఉండే స్పెషల్ బ్రాంచ్ లో ఓ అధికారి అండ తో నే హోంగార్డ్ వసూళ్ల కోసం ఎగబడుతున్నారని కమిషనరేట్ లో గుస గుస లు వినిపిస్తున్నాయి. మట్కా పీడీఎస్ బియ్యం అక్రమరవాణా, బెట్టింగ్ ముఠాల కు సంబంధించి సమాచారం ఉన్నతధికారులకు అడపా దడపా చేరవేస్తూ అదే ముసుగు లో వసూళ్ల దందా కు తెరలేపారు.
ముస్లిం వర్గాల్లో బలమైన నెట్ వర్క్ వుందని బిల్డప్ ఇస్తూ సదరు హోంగార్డ్ గోరంత పనిచేస్తూ కొండత హడావుడి చేస్తున్నారు.స్పెషల్ బ్రాంచ్ లో హోంగార్డ్ స్థాయిలో పనిచేసే వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.
అందులోనూ కేవలం సమాచారం సేకరించి స్పెషల్ బ్రాంచ్ లో ఉండే ఏసీపీ సీఐ లకు నివేదించాలి తదుపరి చర్యలు సీపీ నుంచి వుంటాయి. కానీ ఈ హోంగార్డ్ పెత్తనం ఎలా సాగిస్తారంటే నిందితులను పట్టుకొని నేరుగా సీసీఎస్ కు పట్టుకెళ్లి తానే మక్కెలు విరిచేస్తున్నాడు.
అసలే స్పెషల్ బ్రాంచ్ అందులోనూ ఉన్నతాధికారి సన్నహితుడిగా ముద్ర ఉండడం తో హోంగార్డ్ దూకుడు ను అడ్డుకునే వారే లేకుండా పోయారు.
టాస్క్ ఫోర్స్ పట్టుకునే నిందితులతో నేరుగా వెళ్లి తన టార్గెట్ లో ఉన్న వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తాడు.ఎన్ ఆర్ ఐ కాలనీ కి చెందిన ఓ పాత నేరస్తుడి ని మధ్యవర్తి పెట్టుకున్న హోం గార్డు మట్కా క్యారం బోర్డు నిర్వాహుకులతో పాటు బెట్టింగ్ పీడీఎస్ ముఠాల నుంచి మామూళ్ల వసూళ్లు చేస్తున్నాడు.
ఒక్కోరి నుంచి పది నుంచి ఇరువై వేల రూపాయలు తీసుకుంటున్నాడు. ఆయా దందా గుట్టు చప్పుడు కాకుండా చేసుకునే వారిని గుర్తించి మధ్య వర్తి ద్వార రాయబారం మొదలు పెడుతున్నాడు.
నీ మీద కంప్లెట్ వచ్చింది స్పెషల్ బ్రాంచ్ నుంచి విచారణ చేస్తునని టాస్క్ ఫోర్స్ వచ్చి అటాక్ చేస్తుంది జాగ్రత అంటూ బెదరగొడుతున్నాడు. ఇంకేముంది మధ్యవర్తి ని రంగంలోకి దింపు డీల్ సెట్ చేస్తుకుంటున్నాడు.
ఎవరొచ్చినా నాకు ఫోన్ చేయాలంటూ భరోసా ఇస్తున్నారు. అన్నట్లుగా టాస్క్ ఫోర్స్ సీసీఎస్ టీమ్ లు దాడి చేస్తే నిందితులు నేరుగా హోం గార్డు కు ఫోన్ చేస్తున్నారు. తోచిన మేరకు సహాయం చేస్తున్నాడు.
మామూళ్లు ఇవ్వడానికి ససేమిరా అన్నవారిని టార్గెట్ చేసి వేటాడుతున్నాడు టాస్క్ ఫోర్స్ కు చిక్కిన వారిని కలిసితన టార్గెట్ లో ఉన్న వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నాడు.
ఈ విషయం ఇప్పటికే నేరుగా సీపీ వద్దకు వెళ్ళిందని సమాచారం. ఈ నేపథ్యంలో కొద్దీ రోజులు స్పెషల్ బ్రాంచ్ నుంచి తప్పించారు కానీ ఓ అధికారి ఔదార్యం చూపి మరోసారి అవకాశం ఇప్పించారు.
