అధికారులు వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యంచేయడం వల్లే , వర్షానికి వరి ధాన్యం తడిచిపోయిందని ఆగ్రహానికి గురైన రైతులు బుధవారం రాస్తా రోకో, ధర్నా కు దిగారు .
కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమ్మలంచ గ్రామంలో ఈ ఆందోళన జరిగింది.
ఐదు రోజులుగా వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయనీ, ఇప్పటికే రెండు లారీల ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని కొమలంచ గేటు వద్ద, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు.
సుమారు రెండు గంటల పాటు రాస్తా రోకో నిర్వహించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి వాహదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చివరికి పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు.