మంగళవారం అర్ద రాత్రి నిజామాబాద్ నగరం ను వర్షం ముంచెత్తింది. 11 గంటలకు మొదలైన వర్షం సుమారు గంటసేపు తెరిపి లేకుండా పడింది.ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
బస్టాండ్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్లపక్కనే నిద్ర పోయిన యాచకులు తీవ్ర. ఇబ్బందులకుగురయ్యారు. మురికి కాల్వలు నిండిపోయి ఆ నీరంతా రోడ్లమీదికి వచ్చింది.
భారీ వర్షానికి రోడ్ల మీద ఆరబోసిన వరి ధాన్యం తడిసి పోయింది. కొనుగోళ్ల పక్రియ చివరి దశలో ఉంది ఈ నేపథ్యంలో అకాల వర్షాలు తీరని నష్టం కలిగించింది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .
అంతేకాకుండా జగిత్యాల ఆర్మూర్ ఆదిలాబాద్ కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాలో కూడా వర్షం అతలాకుతలం చేసింది