జాన రమేష్: ఇది సంగతి ; ఆర్మూర్:
ఓవైపు మండుతున్న ఎండలు… మరోవైపు వైన్ షాపులో లైట్ బీర్ల కొరతతో మద్యంప్రియులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు బీర్ల అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. అయితే జిల్లాలో మద్యం ప్రియులకు లైట్ బీర్ల కొరత ఏర్పడింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో లైట్ బీర్ల ధరలు పెరిగాయి. ఎండలతో కాస్త చిల్ అవుదామంటే లైట్ బీర్లు దొరకడం లేదు.
చాలా వైన్ షాపులలో నో బీర్లు అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. లైట్ బీర్లు ఎందుకు దొరకడం లేదు అని మద్యం ప్రియులు ప్రశ్నిస్తే తమకు స్టాక్ దొరకడం లేదని వైన్స్ యజమానులు అంటున్నారు. దినమంత ఎండ వేడిమితో ఉడికిపోయిన ఆయా వర్గాల ప్రజలు సాయంత్రం కాస్త చిల్ అవుదామనుకుంటారు. ముఖ్యంగా సాయంత్రం పూట చిల్ గా ఓ బీరు వేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రెగ్యులర్ గా తాగే వాళ్లే కాదు అప్పుడప్పుడు తాగే వారు సైతం సాయంత్రం పూట బీరు కోసం ఎదురు చూస్తుంటారు.
ఈ మధ్యకాలంలో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సైతం బీర్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టాయి. గత వారం రోజులుగా మద్యం ప్రియులకు వైన్ షాపులో చిల్ బీర్ల కొరత ఏర్పడింది.
ముఖ్యంగా లైట్ బీర్, కేఎఫ్ లైట్, బడ్ వైజర్ టిన్ బీర్స్, ఆర్సి లైట్, క్యూబెర్గ్ వంటి బ్రాండెడ్ లైట్ బీర్లు అస్సలు దొరకడం లేదు. ఒకటికి… నాలుగు… ఐదు వైన్ షాపుల చుట్టూ బిర్ల కోసం తిరిగిన నో స్టాక్ అనే సమాధానమే వస్తుంది. లైట్ బీర్ల కొరత ఎందుకు వచ్చింది? ఎందుకు స్టాక్ లేదా అనేది అర్థం కాక మండిపడుతున్నారు మద్యం ప్రియులు.
రెగ్యులర్ గా బీర్లు తాగే మందు ప్రియులు సైతం సాయంత్రం పూట బిర్ల కోసం ఆరాటపడుతున్నారు.