తలసేమియా పేషంట్ల కోసం ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని తెలంగాణా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించగా, పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా రోగులను ఆదుకోవాలనే తపనతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిణి బి.గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ ఎ.ఓ ప్రశాంత్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
